పవన్ కళ్యాణ్ సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువ: జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ లో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసిపి అధినేత జగన్ గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని ఏవిధంగా మోసం చేశారో ప్రజలకు వివరించారు…అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాట్లాడుతూ…పవన్ కల్యాణ్ గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఏ కార్యక్రమాలు చేశారని నిలదీశారు.
పవన్ కళ్యాణ్ ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఒక ట్వీట్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమో, చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడు బయటకు వచ్చి వెళ్లిపోతారన్నారు. వపన్ విషయంలో సినిమా తక్కువ… ఇంటర్వల్ ఎక్కువ అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో ఇదే పవన్ కల్యాణ‌్ బీజేపీకి,టీడీపీకి ఓటేయమని చెప్పి రాష్ట్రాన్ని ముంచాడా? లేదా? అని సూటిగా ప్రశ్నించారు.
ఇదే పవన్ కల్యాణ్ ఇప్పుడు బాబు, బీజేపీ ముంచారని ఇప్పుడు చెబుతున్నారన్నారు. రాష్ట్రాన్ని ముంచడంలో పవన్ పాత్ర కూడా ఉందన్నారు. అంతేకాకుండా ఇలాంటి వ్యక్తుల గురించి రాజకీయాలలో ప్రస్తావించక పోవడం మంచిది…కేవలం ప్రజల ముందు పేరు సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చే జాబితాకు చెందినవారు పవన్ కళ్యాణ్ అని అన్నారు జగన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here