చంద్రబాబు ని కలిసిన ఎమ్మెల్యే .. దాదాపు ఏడ్చేశాడు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తో టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనరాయణ స్పెషల్ గా మీట్ అయ్యి తన మనసులో బాధని మొత్తం చెప్పుకున్నారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు గా తాను కష్టపడి పని చేస్తున్నాను అనీ టీడీపీ ప్రతిపక్షం లో ఉన్న టైం లో కూడా పార్టీ తరఫున విపరీతంగా పోరాడాను అని కానీ తనకి సామాజిక సమీకరణాల కారణంగా అన్యాయం జరిగింది అనీ ఎంతగానో ఎదురు చూసిన మంత్రి పదవి ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు ఆయన.
బండారు ఆవేదన పట్ల చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. సమీకరణాల కారణంగా కొందరికి పదవులు ఇచ్చానని… పార్టీలో తగిన ప్రాధాన్యతను కల్పిస్తానని… సీనియర్లకు ఎట్టి పరిస్థితిలో అన్యాయం చేయబోనని ఈ సందర్భంగా బండారుకు చంద్రబాబు హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here