బాహుబలి మీద పోలీస్ కంప్లయింట్

బాహుబలి సెకండ్ పార్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంటే తన సొంత తెలుగు రాష్ట్రం తెలంగాణా లో ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళి కి లేనిపోని తలనొప్పులు తెచ్చి పెడుతోంది. ఆరేకటిక పోరాట సమితి ఈ విషయం లో రాజమౌళి ని హెచ్చరించింది. అంతటితో ఆగకుండా ఇవాళ హైదరాబాద్ బంజారా హిల్స్ లో పోలీసులకి ఫిర్యాదు కూడా చేసింది.
ఈ చిత్రంలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ ..‘కటిక చీకటి’ అనే డైలాగ్ చెప్పారని, అందులో కటిక అనే పదం తమను కించపరిచేలా ఉందని ఆరోపించారు. విడుదల ముందర వరకూ అనేక కాంట్రవర్సీ లని ఎదురుకొని వాటిని సక్సెస్ఫుల్ గా దాటుకుని బయటకి వచ్చిన బాహుబలి చిత్రానికి ఇప్పుడు కొత్త తలనొప్పులు ఎదురు అవుతున్నాయి.
సినిమా డైరెక్టర్ మౌళి మీద వారు ప్రత్యెక ఫిర్యాదు చెయ్యడం విశేషం. ఆ డైలాగ్ చెప్పినవారి మీదా , రాసిన వారి మీదా ఎక్కడా ఫిర్యాదు లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here