మైన‌ర్ బాలిక‌పై 22 రోజులు అత్యాచారం..

దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప‌సికందుల‌తో పాటు మైన‌ర్ బాలిక‌లు, యువ‌తులు, వివాహితుల‌పై అత్యాచారాలు జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే వీటిలో బ‌య‌ట‌కు వ‌స్తున్నవి ప‌లు ఘ‌ట‌న‌లైతే బ‌య‌ట‌కు రానివి మాత్రం ఇంకెన్నో. తాజాగా ఓ బాలిక‌పై 22 రోజుల పాటు అత్యాచారం చేశార‌న్న విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఒడిశా రాష్ట్రంలోని క‌ట‌క్ న‌గ‌రంలో ఇది జ‌రిగింది. జ‌గ‌త్‌సింగ్ పూర్ జిల్లా తిర్టోల్ గ్రామానికి చెందిన‌ ఓ 17 ఏళ్ల బాలిక త‌ల్లితండ్రుల‌తో గొడ‌వ ప‌డి ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అయితే ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను ఆమెను ఇంటికి పంపిస్తామ‌ని చెప్పి న‌మ్మించారు. ఆ త‌ర్వ్వాత‌ ఓ పౌల్ట్రీ ఫాంలోకి ఆ బాలిక‌ను తీసుకెళ్లి అత్యాచారం చేశారు. 22 రోజులు సామూహిక అత్యాచారం చేశారు. అయితే దీనిపై స్థానికుల‌కు అనుమానం రావ‌డంతో వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

పౌల్ట్రీ ఫాంపై పోలీసులు దాడి చేసి బాలిక‌ను ర‌క్షించారు. నిందితుల‌ను అరెస్టు చేసి ఆమెను మ‌హిళా స‌ద‌న్‌కు త‌ర‌లించారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 376(2), 376(2), సెక్షన్ 34ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.మహిళల భద్రత విషయంలో నవీన్ పట్నాయక్ సర్కారు విఫలమైందని బీజేపీ ప్రధాన కార్యదర్శి సమంతింఘర్ ఆరోపించారు. అయితే ఎవ‌రెన్ని ఆరోప‌ణ‌లు చేసినా ఇలాంటి ఘ‌ట‌న‌లు మాత్రం మళ్లీ జ‌ర‌గ‌కుండా ఉంటాయా అన్న‌దే ముఖ్యం. ఇప్ప‌టికైనా ఈ అత్యాచారాల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేలా ప్ర‌భుత్వాలు వ్య‌వ‌హ‌రించాల‌ని అంద‌రూ కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here