అమెరికాలో రోజుకు ల‌క్ష కేసులు.. ప‌రిస్థితి ఏంటి..

క‌రోనా వైర‌స్ విజృంభిస్తూనే ఉంది. అమెరికాలో ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంది. ప్ర‌తి రోజూ అమెరికాలో ల‌క్ష కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని నివేదిక‌లు తెలియ‌జేస్తున్నాయి. దీంతో అమెరికా వాసులు ఆందోళ‌న చెందుతున్నారు.

క‌రోనా సెకండ్ వేవ్ కొన‌సాగుతోంది. అయితే క‌రోనా ఎఫెక్టు ప్ర‌పంచ దేశాల్లో అమెరికాలోనే ఇప్పుడు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ప్ర‌తి రోజూ ల‌క్ష‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయంటే అక్క‌డ ప‌రిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇటీవ‌లె అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రిగాయి. దీంతో ఈ ఎన్నిక‌ల మూలంగా కూడా క‌రోనా కేసులు ఎక్కువ‌య్యాయ‌ని ప‌లువురు అంటున్నారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల్లో జో బైడెన్ విజ‌యం సాధించారు.

అయితే అక్క‌డి నిబంద‌న‌ల ప్రకారం బైడెన్ అధ్య‌క్ష పీఠంలో కూర్చునేందుకు ఇంకా స‌మ‌యం ఉంది. ఈ ప‌రిస్థితుల్లో ఆయ‌న దేశంలో పెరుగుతున్న క‌రోనా కేసుల గురించి మాట్లాడారు. క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. తాను అధ్య‌క్షుడిగా బాధ్య‌తలు చేప‌ట్ట‌డానికి చాలా స‌మ‌యం ఉంద‌న్నారు. ఇప్ప‌టి ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించాల‌ని ఆయ‌న కోరారు. కాగా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ ఓట‌మి పాలైనా.. ఆయ‌న ఇంకా న్యాయ పోరాటం చేస్తున్నారు. మ‌రి ఈ వివాదాల నేప‌థ్యంలో క‌రోనా ఇంకే విదంగా విజృంభిస్తుందో అన్న ఆందోళ‌న స‌ర్వ‌త్రా నెల‌కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here