సెల్‌ఫోన్ రిపేర్ వ‌చ్చింద‌ని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు..

సెల్‌ఫోన్ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డంతో కొత్త సెల్ ఇవ్వాల‌ని ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌య‌త్నం చేశాడు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే ఢిల్లీలోని భీమ్ సింగ్ అనే వ్య‌క్తి త‌న మేన‌కోడ‌లికి రూ. 14వేలు పెట్టి ఓ సెల్ కోనిచ్చాడు.

అయితే సెల్ కొన్న నెల రోజుల‌కే హీట్ అవ్వ‌డంతో పాటు హ్యంగ్ అవుతూ వ‌చ్చింది. దీంతో సెల్‌ను మొబైల్ కంపెనీ స‌ర్వీస్ సెంటర్‌లో చూపించాడు. త‌న స‌మ‌స్య‌ల‌న్నీ చెప్పి కొత్త సెల్ ఇవ్వాల‌ని కోరారు. అయితే స‌ర్వీస్ సెంట‌ర్ వాళ్లు మాత్రం కొత్త సెల్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పారు. ప‌లుమార్లు అక్క‌డ‌కు వెళ్లి అడిగిన భీమ్ సింగ్‌.. మ‌రోసారి పెట్రోల్ తీసుకొని అక్క‌డ‌కు వెళ్లాడు. అక్క‌డ సిబ్బంది అదే స‌మాధానం చెప్ప‌డంతో వెంట‌నే త‌న వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని అంటించుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

వెంట‌నే అత‌న్ని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా 40 శాతం గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం భీమ్ సింగ్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 13వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స్థానిక పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. భీమ్ సింగ్ సోద‌రి ఇటీవ‌ల మృతిచెందారు. దీంతో ఆమె కూతురు బాగోగులు మొత్తం మేన‌మామ భీమ్ సింగ్ చూసుకుంటున్నారు. ఆమె 12వ త‌ర‌గ‌తి చ‌దువుతోది. కాగా సెల్ ఫోన్ కొన్న త‌ర్వాత హీట్ అవుతున్న ఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి. అయితే ఇంకేమీ చేయ‌లేక ప‌లువురు సెల్‌ఫోన్‌ను అలాగే వాడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here