చిరు ‘గుండు’ లుక్ ఎందుకోసమో…

ఒకప్పుడు టాలీవుడ్ ను తన సినిమాలతో ఊపు ఊపిన మెగాస్టార్ చిరంజీవి కొనేళ్లు రాజకీయాల్లో బిజీగా ఉండి మళ్లీ ‘ఖైదీ నెo 150’తో బ్యాక్ ఇజ్ బ్యాక్ అంటూ మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చి…  తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఇక ‘సైరా నర్సింహా రెడ్డి’ తర్వాత..  ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ ఇన్ స్టాగ్రామ్  వేదికగా పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఎప్పుడూ స్టైలిష్ హెయిర్ కట్ తో ఉండే చిరు తాజాగా గుండు లుక్ లో దర్శనమిచ్చాడు. అయితే ఈ కొత్త లుక్ ఏ సినిమా కోసమో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే చిరంజీవి కొత్త లుక్ తన తదుపరి చిత్రం ‘వేదాళం’ రీమేక్ కోసమేనని ఓ చర్చ సాగుతోంది. మరి ఎప్పుడూ లేని విధంగా గుండు లుక్ లో చిరు కనిపించడానికి కారణమేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఇక చిరంజీవి ‘వేదాళం’ రీమేక్ తో పాటు… ‘లూసిఫర్’ రీమేక్ లోనూ నటించనున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here