నిజాలు బ‌య‌ట‌పెట్టేందుకు రంగంలోకి దిగిన జ‌గ‌న్‌..

ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన అంత‌ర్వేది ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌య ర‌థం ద‌గ్దం ఘ‌ట‌న‌లో జ‌గ‌న్ స‌ర్కార్ ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకుంది. స్వామి ర‌థం ద‌గ్దం అయినప్ప‌టి నుంచి ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో మండిప‌డిన విష‌యం తెలిసిందే. వై.ఎస్ జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చాక హిందూ దేవాల‌యాల‌పై దాడులు పెరిగాయ‌ని ఆరోపించారు.

ప్ర‌భుత్వం ఈ ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. దీంతో ఏపీ స‌ర్కార్ కూడా దీన్ని సీరియ‌స్‌గానే తీసుకుంది. దీనిపై సీబీఐ విచార‌ణ కోరుతూ రాష్ట్ర డీజీపీ కార్యాల‌యం, హోం శాఖ‌కు లేఖ‌లు పంపింది. దీంతో త్వ‌ర‌లోనే సీబీఐ విచార‌ణ‌కు సంబంధించిన జీవో విడుద‌ల‌వ్వ‌నుంది. ఇక ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఆల‌య ఎగ్జిక్యూటివ్ అధికారి చ‌క్ర‌ధ‌ర‌రావును విధుల నుంచి త‌ప్పిస్తూ స‌స్పెండ్ చేసింది.

ఈ ర‌థం స్థానంలో రూ. 95 ల‌క్ష‌ల‌తో కొత్త ర‌థం నిర్మించాలని నిర్ణ‌యించింది. ఇక మొన్న రాష్ట్ర మంత్రులు వెళ్లి ఘ‌ట‌న స్థలంలో ప‌రిశీలించారు. ఏ విధంగా జ‌రిగిందో విచార‌ణ‌లో తెలుస్తుంద‌ని మాట్లాడారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాజ‌కీయం చేయాల‌ని చూస్తున్న వారికి షాక్ ఇస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ సీబీఐ నిర్ణ‌యాన్ని తీసుకుంది. దీంతో వైసీపీ శ్రేణులు శ‌భాష్ సీఎం సార్ అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here