కొత్త లుక్‌పై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి త‌న గెట‌ప్‌పై ఎట్ట‌కేల‌కు స్పందించారు. ఇటీవ‌ల ఎప్పుడూ లేన‌ట్టుగా ఆయ‌న క్లీన్‌గా క‌నిపించి అంద‌రినీ ఒక్క‌సారిగా అవాక్క‌య్యేలా చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు స‌ర‌దాగా క్లారిటీ ఇచ్చేశాడు.

రెండు రోజుల క్రితం చిరంజీవి గ‌డ్డం, మీసాలు తీసేసిన ఓ ఫోటో హ‌ల్ చ‌ల్ చేసింది. బ్ల‌ఫ్ మాస్ట‌ర్ ద‌ర్శ‌కుడు గోపి గ‌ణేశ్‌తో క‌లిసి దిగిన ఫోటో బ‌య‌ట‌కు వ‌చ్చేస‌రికి అంతా షాక్ అయ్యారు. అయితే కొత్త సినిమా కోస‌మో, ప్ర‌జ‌లకు ఏదో ఒక సందేశం ఇచ్చేందుకో చిరు ఇలా గెట‌ప్ మార్చి ఉంటార‌ని అంతా అనుకున్నారు.

తాజాగా చిరు న‌టిస్తున్న ఆచార్య చిత్రం కోస‌మే ఇలా అయ్యార‌ని అనుకుంటున్న త‌రుణంలో పిక్ పై చిరు క్లారిటీ ఇచ్చారు. స‌ర‌దాగా ఇలా గెట‌ప్ చేంజ్ చేశా అన్నారు. కొత్త సినిమాకు ఈ గెట‌ప్‌కు ఏ మాత్రం సంబంధం లేద‌న్నారు. ఏది ఏమైనా స్టార్స్ ఏదైనా చేస్తే అది అభిమానుల‌పై ప్ర‌భావం చూపుతుంది. అదే మెగాస్టార్ అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here