25 మందిని ఎందుకు చంపారో చెప్పిన మావోయిస్టులు..

మావోయిస్టులు రెచ్చిపోయారు. 25 మందిని చంపేశారు. ఈ మేర‌కు ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. ఈ ఘ‌ట‌న చ‌త్తీస్‌ఘ‌డ్‌లో జ‌రిగింది. మావోయిస్ట్‌ పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ ప్రకటన విడుదల చేసింది.

చత్తీస్‌ఘ‌డ్ తెలంగాణ స‌రిహ‌ద్దులో ఎక్కువ‌గా మావోయిస్టులు వ‌స్తున్నార‌ని ఇటీవ‌ల వార్త‌లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయ‌ని మావోయిస్టులు పేర్కొన్నారు. అయితే అక్క‌డ‌కు వ‌స్తోంది తాము కాద‌ని.. పోలీసులే ప‌లు ప్ర‌ణాళిక‌లు ర‌చించి తాము వ‌స్తున్న‌ట్లు చెబుతున్నార‌ని మావోయిస్టులు అంటున్నారు. పోలీసులే బాంబులు పెట్టి అమాయ‌కుల ప్రాణాలు పోయేందుకు కార‌ణం అవుతున్నార‌ని కానీ ఆ నింద‌లు త‌మ‌పై మోపుతున్నార‌ని మావోయిస్టులు చెబుతున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో పోలీస్‌ అధికారులు నియమించిన 12 మంది రహస్య ఏజెంట్లను, ఐదుగురు కోవర్టులు, 8 మంది ఇన్‌ఫార్మర్‌లను చంపేశారు.  ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల మద్దతుతో ప్రజా కోర్టులో వీరిని శిక్షించిన‌ట్లు మావోయిస్టు పార్టీ దండ‌కార‌ణ్య స్పెష‌ల్ జోన‌ల్ క‌మిటీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఉంది. ఉద్యమ ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు, విప్లవోద్యమాన్ని కాపాడేందుకు ఈ చర్యకు పాల్ప‌డిన‌ట్లు తెలిపింది. గ‌త కొంత కాలంగా మావోయిస్టుల‌పై త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని పేర్కొంది.

మావోయిస్టులు ఎక్కువ‌గా తిరుగుతున్నార‌ని పోలీసులే దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని మావోయిస్టులు అంటున్నారు. తాము వెళ్ల‌ని ప్రాంతాల్లో దాడులు చేసి కావాల‌నే త‌మ‌పై నింద‌లు వేస్తున్నార‌ని మావోయిస్టుల లేఖ‌లో ఉంది. మ‌రి దీంట్లో ఏది నిజ‌మో తేల్చాల్చింది పోలీసులే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here