ఆయ‌న మృతి దేశానికి తీరని లోటు..

దేశంలో ఇటీవ‌ల ప్ర‌ముఖులు మృతి చెందుతున్న ఘ‌ట‌న‌లు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతిచెందారు. అనారోగ్య కార‌ణాల‌తో ఢిల్ల‌లోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న‌కు ఆరోగ్యం విష‌మించ‌డంతో గురువారం చ‌నిపోయారు. దేశం ఓ గొప్ప నాయ‌కుడిని కోల్పోయిందంటూ నేత‌లు కామెంట్లు చేస్తున్నారు.

రాం విలాస్ పాశ్వాన్ లోక్ జ‌నశ‌క్తి పార్టీకి అధ్య‌క్షుడు. ఎన్డీయేలో భాగ‌స్వామ్యం వ‌ల్ల ఆయ‌న కేంద్ర మంత్రిగా ఉన్నారు. పాశ్వ‌న్ ఎనిమిది సార్లు లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. పార్ల‌మెంటులో అత్య‌ధిక కాలం ప‌నిచేసిన చురుకైన వ్య‌క్తుల్లో ఈయ‌న ఒక‌రు. దీంతో ఈయ‌న మ‌ర‌ణాన్ని ప్ర‌ముఖులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. పాశ్వ‌న్ మృతి చెందార‌ని ఆయ‌న కుమారుడు చెప్పిన వెంట‌నే రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి, ప్ర‌ధాన‌మంత్రితో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు అంద‌రూ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. దేశం గొప్ప నాయ‌కుడిని కోల్పోయింద‌ని కామెంట్లు చేశారు.

పాశ్వాన్‌ ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా ఉన్నారు. కీలకమైన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మృతిచెందడం ఎల్‌జేపీకి తీరని లోటుగా నేతలు భావిస్తున్నారు. ఇటీవ‌లె బీహార్ ఎన్నిక‌ల్లో నితిష్ తో క‌లిసి ఎన్నిక‌ల్లో ప‌నిచేసేందుకు తాము సిద్దంగా లేమ‌ని తేల్చి చెప్పి ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్లు పాశ్వ‌న్ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే బీజేపీతో మాత్రం త‌మ పొత్తు కొన‌సాగుతుంద‌ని తెలిపారు. కాగా పాశ్వ‌న్ మ‌ర‌ణంతో ఆ పార్టీ ఎలా ముందుకెళుతుందోన‌న్న ఆస‌క్తి అంద‌రిలోనే నెల‌కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here