నేను నటిస్తున్న సినిమాలే అత్యచారాలకు కారణమా..?

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఓ యువతిపై జరిగిన అత్యచార సంఘటన, హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై యావత్‌ దేశం ఏకమై నినదించింది. సినీ, రాజకీయ నాయకులు ఈ దుర్ఘటన పట్ల తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ మల్లికా షెరావత్‌ ఈ విషయమై స్పందిస్తూ.. ‘మహిళల పట్ల ధోరణి మారేందుకు దేశంలో సంస్కరణ తీసుకొచ్చేవరకు ఇలాంటి ఘటనలు ఆగవు’ అంటూ ట్వీట్‌ చేసింది.

అయితే ఈ ట్వీట్‌ను చూసిన ఓ నెటిజన్‌ మల్లికా పట్ల తీవ్రంగా స్పందించాడు. ‘బాలీవుడ్‌లో మీరు చేసే సినిమాలు.. మీరు చెప్పే మాటలకు పొంతనలేదు. నీతి వ్యాక్యాలు చెప్పే ముందు మీరు అనుసరించి ఇతరులకు చెప్పండి’.. అని కామెంట్లు చేశాడు. దీంతో దీనిపై సీరియస్‌గా స్పందించిన మల్లికా.. ‘అంటే నేను నటించిన సినిమాలు అత్యచారాలను ప్రేరేపిస్తున్నాయా? మహిళలను కించపరుస్తూ బాధపెట్టేది మీలాంటి వాళ్లే. నా సినిమాల వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తే.. చూడటం మానేయండి’ అంటూ వార్నింగ్‌ ఇచ్చిందీ బ్యూటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here