తెలుగు సినిమా ప్రేక్షకులకి మణిశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. సంగీత దర్శకుడిగా తనకంటూ సూపర్ బాణీ ని ఏర్పాటు చేసుకున్న మణి , అందరికీ నచ్చే ట్యూన్ లే పట్టుకొచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో ఇప్పటికీ ఈయన నే ఎంచుకుంటారు నిర్మాతలు. దేవీ శ్రీ ప్రసాద్ వచ్చినా, తమన్ వచ్చినా మణి శర్మ బాణీ ల గొప్పతనం వేరేగా ఉంటూ వచ్చింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ ఇచ్చింది ఈయనే మరి. చిరంజీవి , బాలయ్యల దగ్గర నుంచీ రామ్ చరణ్ వరకూ అన్ని తరాల హీరోలకీ మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ ఇప్పుడు డిమాండ్ తక్కువలో ఉన్నారు.
పోయిన సంవత్సరం ఇంద్రగంటి మోహన కృష్ణ చిత్రం జెంటిల్ మ్యాన్ తో మళ్ళీ తన పాటల గొప్పతనం పూర్తి చేసుకున్న మణి కి ఇప్పుడు వరసగా అవకాశాలు వస్తున్నాయి. వంశీ సినిమా ఫ్యాషన్ డిజైనర్ కి ఆయనే మ్యూజిక్ ఇస్తూ ఉండగా ఇంద్రగంటి చిత్రం ఆమీ తూమీ కి కూడా మ్యూజిక్ ఇస్తున్నారు. హను రాఘవపూడి-నితిన్ ల ‘లై’.. జయంత్ సి పరాన్జీ మూవీ ‘జయదేవ్’.. నారా రోహిత్-పవన్ మల్లెల మూవీలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు మణిశర్మ ఖాతాలో ఉన్నాయి.