మ‌హేష్ బాబు స్టేట్‌రౌడీ మూవీ ఫిక్స్ అయ్యిందా..?

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు మంచి జోష్ మీద ఉన్నారు. లాక్‌డౌన్‌లో సినిమాల‌కు బ్రేక్ వ‌చ్చినా ఆ త‌ర్వాత ఆయ‌న సినిమాలు బుక్ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్ప‌టికే ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ప్రిన్స్ ఇప్పుడు మ‌రిన్ని చిత్రాలు చేసేందుకు ప‌క్కా ప్లాన్ వేసుకుంటున్నారు.

మ‌హేష్ బాబు స్టేట్ రౌడీ అనే టైటిల్‌తో మూవీ చేస్తున్నాడ‌న్న టాక్ వ‌స్తోంది. ఈ సినిమాను అప్ప‌ట్లో మెగాస్టార్ చిరంజీవి తీసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌హేష్ కూడా సేమ్ టైటిల్‌తో సినిమా చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. సూపర్‌స్టార్‌ మహేశ్‌ అప్ కమింగ్ మూవీస్ విషయానికి వస్తే ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ సినిమా చేయడం పక్కా అయ్యింది. దీంతో పాటు రీసెంట్‌గా మహేశ్‌, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని కూడా వార్తలు వినిపించాయి. అయితే మహేష్ వాటికంటే ముందు వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో క్యాన్సిల్ అయిన ప్రాజెక్ట్ ప్లేస్‌లో ఇది వచ్చి చేరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథలో మహేష్ పక్కా మాస్ రౌడీ పాత్రలో కనిపిస్తాడని ,తన పెర్‌ఫార్మెన్స్‌ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని టాక్. ఇక ఈ ప్రాజెక్ట్‌కి ‘స్టేట్ రౌడీ’ అనే టైటిల్‌ని పరిశీలిస్తోందట ఆ సినిమా యూనిట్. అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి ఇదే టైటిల్‌తో భారీ విక్టరీని అందుకున్నాడు. మరి సూపర్ స్టార్‌కి కూడా అదే సెంటిమెంట్ ప్లస్ అవుతుందేమో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here