ఢిల్లీలో రైతుల ఆందోళ‌న‌ల వెనుక పాకిస్తాన్ ప్లాన్ ఉందా..?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు రైతుల ఆందోళ‌న‌ల‌ను కూడా ప‌లువురు రాజ‌కీయాల‌కు వాడుకుంటున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కుల కామెంట్లు చూస్తూ మీకే అర్థం అవుతుంది.

రైతు నిరసనల వెనుక దాయాది పాక్, చైనా ఉన్నాయని, ఆ దేశాలు కుట్రలు పన్నుతున్నాయని కేంద్ర మంత్రి రావ్‌సాహేబ్ దాన్వే మండిపడ్డారు. ఎన్నార్సీ, సీఏఏ విషయంలో గతంలో ముస్లింలను కొందరు తప్పుదోవ పట్టించారని, ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదని అన్నారు. అచ్చు అలాగే రైతులను కూడా ఇప్పుడు కొందరు తప్పుడు ప్రచారాలతో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నార్సీ, సీఏఏ వస్తున్నాయని… ఆరు నెలల్లోగా మిమ్మల్ని తరిమేస్తారని ముస్లింలను భయపెట్టారన్నారు. ఒక్క ముస్లింనైనా వెళ్లగొట్టామా అన్నారు. అప్పుడు వారి ప్రయత్నాలేవీ సఫలం కాలేదని.. ఇప్పుడు రైతుల విషయంలోనూ ప్రస్తుతం అలాంటి పుకార్లే చేస్తున్నారన్నారు.

కాగా ఈ విష‌యంపై శివ‌సేన స్పందించింది. కేంద్రమంత్రికి అలాంటి సమాచారమంటూ ఉంటే వెంటనే రక్షణ శాఖ చైనా, పాక్‌పై సర్జికల్ దాడులు చేయాలని సంజ‌య్ రౌత్ అన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, త్రివిధ దళాలూ దీనిపై సీరియస్‌గా ఆలోచించాలన్నారు. ఇక రైతులు సైతం దీనిపై మాట్లాడారు. తామంతా స్వ‌తంతంగ్రా ఉద్య‌మం చేస్తున్నామ‌ని రైతు సంఘం నాయ‌కులు తెలిపారు. ఎవ‌రో చెబితే వ‌చ్చి ఇక్క‌డ ఉద్య‌మం చేయ‌డం లేద‌న్నారు. మొత్తానికి రైతుల ఉద్య‌మం కూడా రాజ‌కీయాల‌కు ముడిపెడుతున్నార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here