క‌రోనా భ‌యంతో డైప‌ర్లు వాడాల‌ని చైనా ఆదేశాలు..

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ ఇంకా త‌గ్గ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌పంచం వ్య‌క్తిగ‌త జీవితంలో ముందుకు వెళుతోంది. ఉద్యోగులు, వ్యాపార‌స్తులు ఎవ్వ‌రి ప‌నులు వాళ్లు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. అంత‌ర్జాతీయ సేవ‌లు కూడా పున‌రుద్ధ‌ర‌ణ అయ్యాయి. అయితే ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య మొద‌లైంది.

విమానాల్లో ప్ర‌యాణించే వారి వల్ల కూడా క‌రోనా వ్యాపిస్తుంద‌ని ప‌లువురు చెబుతున్నారు. విమానాల్లో బాత్‌రూంలు వాడ‌టం వ‌ల్ల ఏమైనా హాని జ‌రుగుతుందేమో అన్న భ‌యం నెల‌కొంది. కరోనా సంక్షోభం కారణంగా విమానయాన రంగం తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంది. అయితే..ఇటీవల వివిధ దేశాల్లో లాక్ డౌన్ ముగియడంతో మెల్లమెల్లగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా విమానయాన మంత్రిత్వ శాఖ ఫ్లైట్ సిబ్బంది రక్షణ దృష్ట్యా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉన్న విమానాల్లో..సిబ్బంది డైపర్లు ధరించాలని సూచించింది. ప్లేన్‌లోని బాత్రూమ్‌లు వినియోగించవద్దని స్పష్టం చేసింది. ఈ నిబంధన సాధారణ ఎయిర్‌లైన్ కంపెనీలతో పాటూ ఛార్టెడ్ ఫ్లైట్‌లకూ వర్తిస్తుందని పేర్కొంది.

కరోనా సంక్షోభం కొనసాగుతున్నా విమానప్రయాణాలు కొనసాగించవచ్చని ఎయిర్‌లైన్స్ తొలి నుంచీ చెబుతూ వస్తున్నాయి. విమానాల్లో ఎయిర్ ఫిల్టర్లలకు ఆస్పత్తుల్లోని పరికరాలతో సరితూగే సామర్థ్యం ఉంటుందని అవి చెప్పుకొచ్చాయి. అయితే..దీని వల్ల కరోనా రిస్క్ కనిష్ట స్థాయికి చేరుకునేందుకు శాస్త్రపరమైన ఆధారాలేమీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. విమానంలోని ప్రయాణికులు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించినా కూడా కొన్ని సందర్భాల్లో కరోనా వ్యాప్తి జరిగిందని నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here