మహేష్‌ బాబును భయపెట్టిన సినిమా ఏంటో తెలుసా.?

కరోనా పుణ్యామాని ఎప్పుడూ బిజీబిజీగా గడిపేవారు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితులు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఎప్పుడూ షూటింగ్‌ల పేరుతో దేశాలు పట్టుకొని తిరిగే సినీ తారలు చిత్రీకరణలు ఆగిపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు. దీంతో అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని ఒక్కో సెలబ్రిటీ ఒక్కోలా ఉపయోగించుకుంటున్నారు. ఇక ఆన్‌లైన్‌ వీడియో స్ట్రీమింగ్‌ సేవలు అందుబాటులోకి రావడంతో చాలా మంది ఖాళీ సమయాన్ని ఓటీటీలకు కేటాయిస్తున్నారు.

తాజాగా టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూడా తాను నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన ఓ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ‘సోషల్‌ డిలేమా’ అనే చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన మహేష్‌.. ‘నేను ఇప్పటివరకు చాలా హర్రర్‌ సినిమాలను చూశాను. నాకు ఆ జానర్‌ అంటే ఎంతో ఇష్టం.. నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న సోషల్‌ డిలేమా చిత్రం నేను ఇప్పటి వరకు చూసిన అన్ని హర్రర్‌ చిత్రాలకంటే చాలా భయంకరంగా ఉంది. ఇది ప్రతీ ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా’ అంటూ క్యాప్షన్‌ను రాసుకొచ్చారు ప్రిన్స్‌. మరి మహేష్‌ను అంతలా భయపెట్టిన ఆ సినిమాపై మీరూ ఓ లుక్కేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here