రోజు రోజుకీ మహేష్ వయసు తగ్గుతోందా..?

అందంఅభినయంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు ఎవరు సరిలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న మహేష్ ను చూస్తే అబ్బాయిలు కూడా కుళ్లుకుంటారు. తాజాగా యాడ్ చిత్రీకరణ కోసం తీసిన ఫోటో షూట్ లో మహేష్ ను చూస్తే ఎవరికైనా ఇలానే అనిపిస్తుంది.

సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ కొత్త లుక్ ఇప్పుడే బయటకు వచ్చింది. లైట్గా గడ్డం, మీసాలు, డిఫరెంట్ హెయిర్ స్టైల్తో మహేష్ ఆకట్టుకుంటున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోపై నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఆధ్వర్యంలో యాడ్ షూట్ జరిగింది. మళ్లీ షూటింగ్కు రావడం సంతోషంగా ఉందని మహేష్ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడుఇక ఫోటోను చూసిన ఆయన అభిమానులు రోజు రోజుకీ మహేష్ అందం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదని కామెంట్లు పెడుతున్నారు.

https://www.instagram.com/p/CE6_MuanUvZ/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here