అమ్మకోసం చిరు స్పెష‌ల్‌..

మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ఏదో స్టైల్లో క‌నిపిస్తూ ఉంటారు. సినిమాల్లో ఆయ‌న విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక నిజ‌జీవితంలో కూడా ఆయ‌న అంతే విభిన్నంగా ఉంటారు.

మొన్న ఓ రోజు చిరంజీవి త‌న మ‌నువ‌రాలితో క‌లిసి పాట‌లు పాడుతూ డ్యాన్స్ చేసిన వీడియోను అభిమానుల‌తో పంచుకున్నారు. తాజాగా క‌రోనా స‌మ‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో అవ‌గాహ‌న క‌ల్పించే వీడియోలు చిరు సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేశారు.

తాజాగా ఆయ‌న త‌న త‌ల్లితో ఓ వీడియో రిలీజ్ చేశారు. క‌ట్టె ప‌రిగె అనే చిన్న సైజు చేప‌ను ఆయ‌న స్వ‌యంగా వండారు. చింతొక్కుతో క‌ల‌పి దీన్ని వండ‌టం గోదావ‌రి జిల్లాల్లో ప్ర‌త్యేక‌మైన వంట‌. ఈ వంట చేసిన చిరంజీవి త‌ల్లికి వ‌డ్డించి ఎలా ఉందో చెప్పాల‌ని కోరారు. ఈ వీడియోను చిరు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. చిరు వీడియోపై నెటిజ‌న్లు స్పందిస్తున్నారు. అయితే మెగాస్టార్ ఇలా వంట చేయ‌డం కొత్తేమీ కాదు గ‌తంలో చాలాసార్లు చేశారు.

https://youtu.be/C6NbPb2dRx0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here