ర‌హ‌స్యంగా క‌త్రినాకైఫ్ ల‌వ్‌..? బ‌య‌ట‌ప‌డ్డ ఫోటోలు

బాలివుడ్ బ్యూటీ క‌త్రీనాకైఫ్‌, హీరో విక్కీల వ్య‌వ‌హారం మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. గ‌తంలో వీరు ప్రేమలో ఉన్నార‌న్న పుకార్లు వ‌చ్చినా వాటిని వీరు ఒప్పుకోలేదు. ఇప్పుడు మ‌రోసారి వీరి ఫోటోలు సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌య‌ట‌ప‌డ్డాయి.

విక్కీ కౌశ‌ల్, క‌త్రీనా కైఫ్ ఇద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని బాలీవుడ్‌లో టాక్‌. అయితే ఈ విష‌యాన్ని వీరు ఎప్పుడూ దృవీక‌రించ‌లేదు. వీరిద్ద‌రూ పార్టీలు, ఫంక్ష‌న్లతో పాటు ప‌లు సంద‌ర్బాల్లో ఒక‌టిగా కనిపించారు. కానీ మా మ‌ధ్య ఏం లేదు. మేము మిత్రులం మాత్ర‌మే అని క్లారిటీ ఇచ్చారు విక్కీ కౌశ‌ల్.

అయితే తాజాగా విక్కీ క‌త్రీనా ఇంటికి వెళ్లిన ఫోటోలు మ‌రోసారి బ‌య‌ట ప‌డ్డాయి. మాస్క్ పెట్టుకొని, త‌ల‌కు క్యాప్ పెట్టుకొని విక్కీ కారు దిగుతూ రాత్రి క‌త్రినా ఇంటికి వెళ్లార‌ని బాలివుడ్ వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి. ఇలా డైరెక్టుగా ఫోటోల్లో క‌నిపిస్తుండ‌టంతో నెటిజ‌న్లు వీరిద్ద‌రి ల‌వ్ మ్యాట‌ర్‌పై మరోసారి కామెంట్లు చేసుకుంటున్నారు. మ‌రి ఇప్పుడైనా వీరు త‌మ ప్రేమ వ్య‌వ‌హారంపై క్లారిటీ వ‌స్తుందో లేదా తాను సింగిల్ అని విక్కీ అంటారో చూడాలి మ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here