గ్రామ‌వార్డు సచివాల‌యాల‌పై సీఎం కీల‌క ఆదేశాలు

ఏపీలో గ్రామ వార్డు సచివాల‌యాల పనితీరుపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీలక నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఎన్న‌డూ లేని విధంగా వాలంటీర్ల వ్య‌వస్థ‌తో పాటు, స‌చివాల‌యాల ఏర్పాటుతో సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికే దేశంలో పేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. నేడు ప్ర‌జ‌ల సంక్షేమం కోసం మ‌రికొన్ని నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

గ్రామ‌ వార్డు స‌చివాల‌యాల‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌త్యేకంగా వీటికోసం పీఎంయూ కాల్ సెంట‌ర్‌ను ఆయ‌న ప్రారంభించారు. దీనివ‌ల్ల స‌చివాల‌యాల్లో ఎక్క‌డ ద‌ర‌ఖాస్తులు ఆగినా పీఎంయూ అప్ర‌మ‌త్తం చేస్తుంది. దీని ద్వారా గ్రామ‌స్థాయిలో ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవ్వ‌నున్నాయి. మొద‌ట‌గా నాలుగు సేవ‌లు,  అక్టోబ‌రు నుంచి 543 సేవ‌లు అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

స‌మీక్ష‌లో భాగంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ స‌చివాల‌యాల్లో డిజిట‌ల్ బోర్డులు పెట్టి ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు తెలిసేలా చూడాల‌న్నారు. సెప్టెంబ‌రులోగా గ్రామ వార్డు స‌చివాల‌యాల్లో ఖాలీల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని చెప్పారు. ఇక స‌చివాల‌యాల్లో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవ్వ‌క‌పోతే స‌మాచారం సీఎంఓకు తెలియాల‌న్నారు. గ్రామ వార్డు స‌చివాల‌యాల ద్వారా ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు 90 రోజుల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. ఏ నెలలో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు ఆ నెల‌లోనే ప‌రిష్కరించుకుని యాక్ష‌న్ ప్లాన్‌కు సిద్ధ‌మ‌వ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here