ఆంగ్లంలో ఎందుకు మాట్లాడ‌రు.. చిదంబ‌రం

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ఇంగ్లీషులో ఎందుకు మాట్లాడ‌ర‌ని  కాంగ్రెస్ పార్టీ నేత‌ చిదంబ‌రం అన్నారు. డీఎంకే నేత క‌నిమొళికి ఎదురైన అనుభ‌వంపై స్పందించిన చిదంబ‌రం త‌న అనుభ‌వాలు చెప్పుకున్నారు.

ఢిల్లీ వెళ్లేందుకు చెన్నై ఎయిర్‌పోర్టుకు ఎంపీ క‌నిమొళి వెళ్లారు. అక్క‌డ త‌న‌కు హిందీ రాద‌ని, త‌మిళంలోకానీ ఇంగ్లీషులో మాట్లాడాల‌ని ఓ మ‌హిళా అధికారిని క‌నిమొళి కోరారు. దీంతో వెంట‌నే ఆ అధికారి మీరు భార‌తీయులేనా అని ప్రశ్నించారు. ఈ విష‌యాన్ని క‌నిమొళి ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. అయితే ఢిల్లీ విమానాశ్ర‌యంలో సీఐఎస్ఎఫ్ అధికారులు క‌నిమొళిని క‌లిసి మాట్లాడారు.

ఇప్పుడు ఇదే విషయంపై చిదంబ‌రం స్పందిస్తూ త‌న‌కు కూడా ఇదే త‌ర‌హాలో గ‌తంలో చాలా అనుభ‌వాలు ఎదుర‌య్యాయ‌ని చెప్పారు. ఇంటర్వూల‌లో, ఫోన్‌ల‌లో హిందీలో మాట్లాడాల‌ని ప‌లువురు అడిగిన‌ట్లు గుర్తుచేశారు. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు హిందీ, ఇంగ్లీషు రెండుభాష‌ల్లో మాట్లాడేలా కేంద్ర ప్ర‌భుత్వం చొర‌వ చూపాల‌న్నారు. ఇంగ్లీషు మాట్లాడే ఉద్యోగులు హిందీ నేర్చుకొని మాట్లాడుతున్న‌ప్పుడు, హిందీ మాట్లాడే ఉద్యోగులు ఇంగ్లీషు నేర్చుకోలేరా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here