క‌రోనా పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన బిల్‌గేట్స్‌

క‌రోనా కొన్నేళ్ల పాటు మ‌న‌తోనే ఉంటుంద‌ని ప‌లువురు శాస్త్ర‌వేత్త‌లు చెబుతుంటే మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్స్‌గేట్స్ మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడారు. క‌రోనా మ‌న నుంచి దూరంగా వెళ్లిపోతుంద‌న్నారు.

2022 కంతా క‌రోనా ప్ర‌భావం పూర్తిగా తగ్గిపోతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. త్వ‌రలోనే క‌రోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని బిల్‌గేట్స్ అన్నారు. క‌రోనా వ్యాక్సిన్ త‌యారీలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేష‌న్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇండియాలోని సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు గేట్స్ ఫౌండేష‌న్ నుంచి 150 మిలియ‌న్ డాల‌ర్ల మూల‌ధ‌నం అంద‌నుంది.

భార‌త్ స‌హా 92 దిగువ‌, మ‌ధ్య ఆసియా దేశాల‌కు 100 మిలియ‌న్ డోసుల క‌రోనా వ్యాక్సిన్‌ల‌ను స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఈ నేప‌థ్యంలో బిల్ గేట్స్ మాట‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.  వ్యాక్సిన్ త‌యారీ, ప‌రిశోధ‌న‌ల్లో కీల‌క అడుగులు ప‌డుతున్న‌ట్లు బిల్ గేట్స్ చెప్పారు.  2021 నాటికి వైర‌స్ ప్రభావం త‌గ్గించ‌గ‌లిగితే.. 2020 కంతా ప్ర‌పంచం నుంచి పూర్తి స్థాయిలో వైర‌స్ తొల‌గిపోతుంద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here