ఆ ప్రశ్న మా పేరెంట్సే అడగట్లేదు.. నీకెందుకు.?

ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా సినీ తారలు అభిమానులతో ముచ్చటించడం సర్వసాధారణమైంది. అభిమానులు అడిగే చిలిపి ప్రశ్నలకు కూడా తారలు సమాధానాలిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా సైట్లు ఇందుకోసం సరికొత్త ఆప్షన్స్‌ తీసుకొచ్చాయి. తాజాగా అందాల తార లావణ్య త్రిపాఠి ఇలాగే అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు లావణ్య తనదైన శైలిలో సమాధానమిచ్చింది.

ఈ క్రమంలో లావణ్య చేతికి ఉన్న రింగ్‌ చూసిన అభిమాని ఒకరు మేడమ్‌ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు.. అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు కాస్త కోపంగానే సమాధానమిచ్చిన లావణ్య.. ‘అమ్మాయిలు కనీసం సొంతంగా ఉంగరాలు కూడా కొనుక్కోలేరా.. అమ్మాయిలు ఉంగరం పెట్టుకుంటే పెళ్లి అయినట్లు లేదా పెళ్లి చేసుకోబోతున్నట్లేనా’ అంటూ కామెంట్‌ చేసింది.

ఇక మరో అభిమాని అడిగిన.. ‘అక్క మీ పెళ్లి ఎప్పుడు’ అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘నన్ను ఆ విషయాన్ని మా తల్లిదండ్రులే అడగడం లేదు. నీకెందుకు’ అటూ ప్రశ్నించింది. వీటితో పాటు ఐపీఎల్‌లో తన ఫేవరేట్‌ టీమ్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ అని, సినిమా షూటింగ్‌లు లేనప్పుడు ‘నెట్‌ఫ్లిక్స్‌ లో సినిమాలు చూస్తాను’ అని చెప్పుకొచ్చిందీ సొట్ట బుగ్గల చిన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here