చెమటోడుస్తున్న లావణ్య..

ఫిట్‌నెస్‌పై సినీతారలు ఎక్కువ ఆసక్తిచూపిస్తారన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇటీవల హీరోయిన్లు కూడా ఫిట్‌నెస్‌ కాపాడుకునే క్రమంలో జిమ్‌ల బాట పడుతున్నారు. హీరోలతో సమానంగా పోటీ పడుతూ జిమ్‌లలో వర్కవుట్లు చేస్తున్నారు. తాము జిమ్‌లలో చేస్తున్న వర్కవుట్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు సుందరీమణులు.

తాజాగా ఇలాంటి ఓ వీడియోనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది అందాల తార లావణ్య త్రిపాఠి. జిమ్‌లో హెవీ వర్కవుట్లు చేస్తోన్న సమయంలో తీసిన వీడియోను పోస్ట్‌ చేస్తూ..‘నేనింకా ఆ స్థానాన్ని చేరుకోలేను. కానీ త్వరలోనే ఆ స్థానాన్ని అందుకుంటాను. ఈ రోజు మనం కష్టపడి చెమటొడ్చితేనే.. రేపనేది మనకు బాగుంటుంది’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటీ. ఇక సినిమాల విషయానికొస్తే లావణ్య ప్రస్తుతం.. ‘A1 ఎక్స్‌ప్రెస్‌’, ‘చావు కబురు చల్లగా’ చిత్రాల్లో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here