పవన్‌ రెమ్యూనరేషన్‌ రోజుకు రూ. కోటిన్నర..?

టాలీవుడ్‌లో ఎంత మంది హీరోలున్నా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కు ఉన్న ప్రత్యేకతే వేరు. జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్‌ స్టార్‌ రేంజ్‌ రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత రాజకీయాల్లో బిజీగా మారిన పవర్‌ స్టార్‌ కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ మేకప్‌ వేసుకోవడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఏకంగా మూడు సినిమాలను వరుసలోపెట్టి అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపారు.

ఇదిలా ఉంటే తాజాగా పవన్‌ రెమ్యూనరేషన్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. పవన్‌ ఒక్క సినిమాకు రూ.50 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం పవన్‌ ఒక్క సినిమాకు 30 నుంచి 40 రోజుల కాల్‌ షీట్లు మాత్రమే ఇవ్వనున్నాడట. ఈ లెక్కన చూసుకుంటే.. పవన్‌ ఒక్క రోజుకే కోటి రూపాయలకుపైగా రెమ్యూనరేషన్‌ తీసుకోనున్నాడన్నమాట. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఇది విన్న పవన్‌ అభిమానులు మాత్రం ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here