హెల్ప్ చేయ‌మ‌ని అడిగితే అత్యాచారం చేశాడు..

దేశంలో అత్యాచారాలు ఎక్కువ‌వుతున్నాయి. కేర‌ళ‌లోని ఓ రాష్ట్రంలో స‌హాయం చేయ‌మ‌ని అడిగిన ఓ బాలిక‌ను ఓ వ్య‌క్తి అత్యాచారం చేశాడు. ఈ ఘ‌ట‌న కేర‌ళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయంలో పోలీసులు నిందితుల‌ను అరెస్టు చేశారు.

వివ‌రాల్లోకి వెళితే కేరళ రాష్ట్రంలోని కోళికోట్లై స‌మీపంలో నివాసం ఉంటున్న 13 సంవ‌త్స‌రాల బాలిక ఫేస్‌బుక్‌లో త‌మిళ‌నాడులోని హోసూరు స‌మీపంలోని వెప్ప‌న్‌ప‌ల్లికి చెందిన ధ‌ర‌ణి అనే యువ‌కుడికి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. వీరి ప‌రిచ‌యం ప్రేమగా మారింది. అయితే ఈ బాలిక ప్రియుడిని చూడాల‌ని అనుకొని అప్ప‌టికే ప‌రిచ‌యం ఏర్ప‌డిన‌..విబిన్‌రాజ్ అనే వ్య‌క్తిని అడిగింది. అత‌డు కారులో తీసుకెళ‌తాన‌ని చెప్పాడు. తీరా కారులో విబిన్‌రాజ్ మ‌రో ఇద్ద‌రిని తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.

అనంత‌రం ఓ బస్టాండులో విడిచిపెట్టి వెళ్లారు. త‌ర్వాత బాలిక త‌న ప్రేమికుడు ధ‌ర‌ణికి ఫోన్ చేసి జ‌రిగిన విష‌యం చెప్ప‌గా అత‌డు వ‌చ్చి త‌న బంధువుల ఇంటికి ఆ బాలిక‌ను తీసుకెళ్లాడు. కాగా త‌ల్లితండ్రులు బాలిక క‌నిపించ‌క‌పోవ‌డంతో కేర‌ళ‌లోని పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. బాలిక స‌మాచారం తెలుసుకున్న పోలీసులు అక్క‌డ‌కు వెళ్లి ప్రియుడు ధ‌ర‌ణిపై కూడా కేసు న‌మోదు చేశారు. ఆ త‌ర్వాత అత్యాచారం చేసిన ముగ్గురిపై కూడా కేసు న‌మోదు చేసి వారిని అరెస్టు చేశారు.

ఫేస్ బుక్ ప‌రిచ‌యం ద్వారా 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఆ బాలిక ప్రేమ వ్య‌వ‌హారం అంటూ ఇలా చేయడంపై విష‌యం తెలుసుకున్న వారంతా మండిప‌డుతున్నారు. యువ‌తీ యువ‌కులు సెల్ ఫోన్ల ద్వారా చెడు వ్య‌స‌నాలకు బానిస‌లు అవ్వ‌కూడ‌ద‌ని అంటున్నారు. మితిమీరిపోతే ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతాయ‌ని ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here