చంద్ర‌బాబుపై మండిప‌డ్డ ల‌క్ష్మీపార్వ‌తి..

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుపై ఏపీ తెలుగు అకాడ‌మీ చైర్ ప‌ర్స‌న్ ల‌క్ష్మీ పార్వ‌తి మండిప‌డ్డారు. చంద్ర‌బాబు అవినీతి అక్ర‌మాల‌పై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరుతూ ప్ర‌ధానికి లేఖ రాస్తున్న‌ట్లు చెప్పారు.

చంద్ర‌బాబుకు వ్య‌వ‌స్థ‌ల ప‌ట్ల చిత్త‌శుద్ధి ఉంటే ఆయ‌న చేసిన అవినీతి, అక్ర‌మాల‌పై సీబీఐ విచార‌ణ‌కు సిద్ధ‌ప‌డాల‌ని అన్నారు. చంద్ర‌బాబు అక్ర‌మాల‌పై అప్ప‌ట్లోనే తాను కేసులు వేస్తే… 14 ఏళ్ల పాటు స్టేల‌తో అడ్డుకున్నార‌న్నారు. రాజ‌కీయ ముసుగులో వ్య‌వ‌స్థ‌ల‌ను దోపిడీ చేస్తున్నార‌న్నారు.

చంద్ర‌బాబు అవినీతి అక్ర‌మాల‌పై ప్ర‌ధాని స్పందించి విచార‌ణ‌కు ఆదేశించాలన్నారు. ఇక ఫోన్ల ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్న చంద్ర‌బాబు క‌నీస ఆధారాలు లేకుండా ప్ర‌ధానికి లేఖ రాయ‌డ‌మేంట‌ని ఆమె ప్ర‌శ్నించారు. త‌న అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకునే ప్ర‌య‌త్నం బాబు చేస్తున్నార‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here