టీడీపీ లోకి లగడపాటి రాజ్ గోపాల్ ?

బెజవాడ రాజకీయం గురించి ఎవ్వరు మాట్లాడినా కాని లగడపాటి రాజ్ గోపాల్ , ఆయన రాజకీయ ప్రస్థానాన్ని తప్పకుండా చెప్తారు. బెజవాడ రాజకీయాలలో తనదైన శైలి లో ముద్ర వేసిన రాజ్ గోపాల్ ఆ మధ్యన రాజకీయ సన్యాసం తీసుకున్నారు. విభజన టైం లో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి ఎంపీ పదవిని సైతం వదిలేసుకున్న ఆయన రాజకీయాలలోకి రాను అంటూ ప్రతిజ్ఞ కూడా చేసారు.
అయితే రాబోయే లోక్ సభ లో విజయవాడ నుంచి టీడీపీ తరఫున ఆయన రాబోతున్నారు అని తెలుస్తోంది. నారా చంద్రబాబునాయుడిని కలిసి నగరంలో పార్టీ పటిష్ఠతపై తాను చేయించిన సర్వే నివేదికను స్వయంగా అందించినట్టు సమాచారం. మీడియా కి సైతం తెలియకుండా రెండు రోజుల క్రితం వీరిద్దరి మధ్యనా భేటీ జరిగింది అని తెలుస్తోంది. వీరిద్దరి భేటీ గురించి లీక్ అవ్వడం తో అక్కడికి చేరుకున్న మీడియా తో సైతం లగడపాటి మాట్లాడలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here