‘తమిళనాడు లో మేము వేలు పెట్టడం లేదు’

తమిళనాడు లో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ పరిణామాల సంగతి మనం చూస్తూనే ఉన్నాం. క్షణానికి ఒక లాగా వేగంగా ఇక్కడ రాజకీయం మారుతూ వస్తోంది. అయితే దీనంతటికీ కారణం బీజేపీ ఏ అని తన పంతం నేగ్గించుకోవడం కోసమే ఇక్కడ బీజీపీ తెలివిగా పావులు కదుపుతోంది అనే వాదన రాజకీయ విశ్లేషకుల లో ఒక వర్గం నుంచి వినిపిస్తోంది. ఇప్పుడే కాదు జయలలిత చావు తరవాత కూడా వెంకయ్య నాయుడు , బీజేపీ ఇక్కడ వ్యవహారాలు నడిపించాయి అనీ శశికళ జైలుకి వెళ్ళడం వెనకాల కూడా బెజేపీ హస్తం ఉంది అంటూ ఉంటారు.

ఈ మాటలు అన్నీ ఒక్కసారిగా ఖండించారు వెంకయ్య. హైదరాబాద్ లో మీడియా తో మాట్లాడిన వెంకయ్య అన్నాడీఎంకేలో జరుగుతున్న నాటకీయ పరిణామాలతో తమకు సంబంధం లేదని, అసలా రాష్ట్ర రాజకీయాలపైనే తమకు ఆసక్తి లేదని అన్నారు సంక్షోభం అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అంటున్నారు వెంకయ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here