‘సినిమాల మీద ప్రేమ ఉన్న బాలయ్య కి మేమంటే ప్రేమ లేదు’

హిందూపురం కి ఏ ముహూర్తం లో బాలయ్య ఎమ్మెల్యే గా ఎన్నిక అయ్యాడో కానీ అప్పటి నుంచీ ఆ నియోజికవర్గాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు అంటూ బాగా విమర్శలు వెల్లువ ఎత్తాయి. బాలయ్య కి వ్యతిరేకంగా ఇప్పుడు వైకాపా తో పాటు జనం అంతా మమేకం అయ్యి ర్యాలీ నిర్వహించారు. పట్టణం లో ఉన్న భయంకరమైన తాగునీటి సమస్య ని వెంటనే పరిష్కరించాలి అనీ రహదారుల మరమ్మత్తులు చేసి తీరాలి అంటూ దున్నపోతుల మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు.
దున్నపోతులపై నినాదాలు రాసి, వాటిని ఊరేగింపుగా తీసుకెళ్తూ, ఈ ర్యాలీని చేపట్టారు. ఎమ్మెల్యే పూర్తిగా సినిమాల్లో కి మనసు పడుతున్నాడు తప్ప తమ నియోజికవర్గాన్ని పట్టించుకోవడం లేదు అంటూ ప్రజలు సైతం గొడవ చేస్తున్న వేళలో ఈ ర్యాలీ కి భారీగా జనం వచ్చారు.  నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ, వైకాపా నేతలు రోడ్డుపై బైఠాయించడంతో వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here