ప్ర‌భాస్ , అనుష్కా మ‌ధ్య‌లో కృష్ణం రాజు

ప్ర‌భాస్, అనుష్కాల పెళ్లి. వీళ్ల‌ద్ద‌రు చేసిన సినిమాలు కానీ, పెయిర్ గురించి ఎంత‌మాట్లాడుకున్నా త‌క్కువే అవుతుంది. వ‌య‌సు 37 అయినా ప్ర‌భాస్ త‌న పెళ్లి మాటే ఎత్త‌డంలేదు. అనుష్కా కూడా అంతే. వాళ్ల‌ద్ద‌రు ఎలా ఉన్నా..సోష‌ల్ మీడియాలో డార్లింగ్, జేజెమ్మ పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.గ‌తంలో వీళ్లిద్ద‌రు పెళ్లి చేసుకుంటున్నారని, బాహుబ‌లి2 త‌రువాత పెళ్లి పీఠ‌లెక్క‌డ‌మే ఖాయ‌మ‌నే వార్త‌లు ఓ ఊపు ఊపేశాయి.

అది నిజ‌మే అన్న‌ట్లుగా ప్ర‌భాస్, అనుష్కాల బిహేవియ‌ర్ అలానే ఉంటుందిలేండి. సినిమా ప్ర‌మోష‌ల్లో, ఆడియో ఫంక్ష‌న్, మీడియాతో చిట్ చాట్ లో కానీ అమ‌ర‌ప్రేమికుల్లానే ఉంటారు. బాహుబ‌లి 2 రిలీజ్ సంద‌ర్భంగా ఈ హిట్ ఫెయిర్ ను నేష‌న‌ల్ మీడియా ఇంట‌ర్వ్యూ చేసిన సంద‌ర్భంగా అనుష్క త‌న‌మ‌న‌సులో మాట చెప్పేసింది. ‘రాణా దగ్గుబాటి, ప్రభాస్.. వీళ్లిద్దరిలో ఎవరు ఎక్కువ సెక్సీ..?’ అని యాంకర్ అడుగగా,..అనుష్కా.., ప్ర‌భాస్ సెక్సీ అనీ, రాణా త‌న‌కు సోద‌రుడుతో స‌మానమ‌ని త‌న వ్యూలో చెప్పుకొచ్చింది.
అయితే ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ , అనుష్కాల పెళ్లిపై ఓ రూమ‌ర్ న‌డుస్తోంది. అనుష్కాను ప్ర‌భాస్ పెళ్లి చేసుకువడం పెద‌నాన్న కృష్ణం రాజుకు ఇష్టం లేదంట. మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ సినిమా స‌మ‌యంలో కాజల్ పై మ‌న‌సు పారేసుకున్న ప్ర‌భాస్ ఇదే విష‌యాన్ని కృష్ణంరాజుతో చెప్పాడ‌ని, అందుకు ఆయ‌న ఒప్పుకోక‌పోవ‌డంతో కొంత‌కాలం వాళ్లిద్ద‌రి మ‌ధ్య మాట‌ల్లేవ‌నే టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు అనుష్కాను పెళ్లి చేసుకుంటాన‌ని ప్ర‌భాస్ త‌న మ‌న‌సులో మాట భ‌య‌ట పెట్టిన‌ట్లు ..అందుకు పెద‌నాన్న ఒప్పుకోక‌పోవ‌డంతో పెళ్లినే దాట వేస్తున్న‌ట్లు గుస‌గుస‌. సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల జీవితం పై ప్ర‌స్తావ‌న తెచ్చిన రెబల్ స్టార్ ఇండ‌స్ట్రీ అమ్మాయిని కాకుండా వేరే రంగానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌ని ప్ర‌భాస్ తో అన్న‌ట్లు ఇన్న‌ర్ టాక్ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here