సోనియా గాంధీ కాళ్లు మొక్కిన పీఎం మోడీ..?

 ప్ర‌ధాని మోడీ ,సోనియా గాంధీ కాళ్లు మొక్కాడా…ఒక‌రు దేశానికి రాజైతే,మ‌రొక‌రు నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షురాలు . అలాంటి రాజు ఓ పార్టీ అధ్య‌క్షురాలి కాళ్ల‌కు న‌మ‌స్క‌రిస్తాడా. గౌరవమర్యాదలు చూపించడంలో ప్రధాని అందరికి ఆదర్శంగా ఉంటారు. కానీ ప్రత్యర్ధి పార్టీకి చెందిన అధినేత్రి అది తన సమవయస్కురాలైన సోనియా గాంధీకి ప్రధాని మోడీ నమస్కారాలు చేశారా…?
 అంటే అవున‌నే అనిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఫోటోల్ని చూస్తుంటే. మోడీ పార్టీని, దేశాన్ని బ‌లోపేతం కోసం కృషి చేస్తుంటే సోనియాగాంధీ అనారోగ్యం కార‌ణంగా పార్టీ కార్య‌క‌లాపాలకు దూరంగా ఉన్నారు. ఈనేప‌థ్యంలో సోనియా కాళ్ల‌కు న‌మ‌స్క‌రిస్తున్న మోడీ ఫోటో నెట్టింట్లో షికార్లు చేస్తున్నాయి. ఈ ఫోటోపై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. 2013 మధ్యప్రదేశ్ లో జ‌రిగిన బీజేపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో బీజేపీ నేత అద్వానీ కాళ్ల‌కు మోడీ న‌మ‌స్క‌రించారు.  అదే ఫోటోను ఎవ‌రో కావాల‌ని ఇలా మార్ఫింగ్ చేశార‌ని  అంటున్నారు. ఇలాంటి  త‌ప్పుడు ప్రచారాన్ని న‌మ్మొద్ద‌ని నెటిజ‌న్ల‌కు క‌మ‌లం నేత‌లు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here