కొరటాల దర్శకత్వంలో అఖిల్ సినిమా?

అక్కినేని వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైనా అఖిల్ ఇప్పటి దాకా సరైన హిట్టు కో ట్టలేకపోయాడు. ఈ నేపథ్యంలో సరైన హిట్ కోసం అఖిల్ చాల స్టోరిలు విన్నడం జరిగింది.ఇటీవల వచ్చిన ‘హలో’ కూడా ఆశించిన స్థాయిలో హిట్ కొట్టలేకపోయింది. ఈ క్రమంలో నాగార్జున .. అఖిల్ మూడవ సినిమా బాధ్యతలను కొరటాల చేతుల్లో పెట్టాలనే ఉద్దేశంతో వున్నారని చెప్పుకుంటున్నారు. కథను రెడీ చేసుకోవడంలోనూ .. కథనాన్ని నడిపించడంలోను కొరటాలకి మంచి పేరుంది. అందువలన అఖిల్ సినిమా ఆయన చేసే ఛాన్స్ చాలావరకూ ఉందని అంటున్నారు.
ప్రస్తుతం ఆయన మహేశ్ తో చేస్తోన్న ‘భరత్ అనే నేను’ చివరిదశకు చేరుకుంది. ఆ తరువాత ప్రాజెక్టును ఆయన ఎవరితోనూ కమిట్ కాలేదు. అయితే ఇంతకుముందు కొరటాల శివ నానితో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి…ఇదిలావుండగా నాని సినిమా పక్కనపెట్టి అఖిల్ సినిమా చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది ఇండస్ట్రీ వర్గాల ద్వారా. ఎందుకంటే అఖిల్ సినిమాకి నిర్మాతగా నాగార్జున వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగార్జున కొరటాల శివకి ముందే అడ్వాన్స్ ఇచ్చినట్లు వార్తలు వినబడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here