ఎన్టీఆర్ సినిమాకి వచ్చిన పుకార్లకు చెక్ పెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడం మనకందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో డైరెక్టర్ త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో తన తర్వాత సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా అజ్ఞాతవాసి సినిమాకి మ్యూజిక్ అందించిన అనిరుద్ ని ఎన్టీఆర్ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా ప్రకటించాడు. అయితే అనూహ్యాంగా అతన్ని తప్పించటంతో ఆ స్థానంలో థమన్‌ వచ్చి చేరాడు.
అజ్ఞాతవాసితో అనిరుధ్‌ నిరుత్సాహపరిచాడని, అందుకే త్రివిక్రమ్‌ అతన్ని తప్పించడంటూ ఇండస్ట్రీ లో టాక్‌ వినిపించింది. ఈ విషయమై అనిరుధ్‌ హర్టయ్యాడని, ఇకపై అసలు తెలుగు ప్రాజెక్టులే ఓకే చేయకూడదని నిర్ణయించుకున్నాడంటూ రకరకాల పుకార్లు షికారు చేశాయి. కానీ, ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెడుతూ ఆ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. గురూజీ, తారక్‌, థమన్‌, చిత్ర నిర్మాతలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు, చిత్రం ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అంటూ అనిరుధ్‌ ట్వీట్‌ చేశాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలాఖరు నుండి జరుపుకోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here