ద‌ళారి, బ్రోకర్ అంటూ విరుచుకుపడ్డ కొడాలి నాని

80 ఏళ్లు వ‌స్తే ఇంట్లో నుంచి బయ‌ట‌కు రానివ్వరు.. మంత్రి కొడాలి నాని వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబునాయుడుపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ద్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబు పెట్టిన 8వేల కోట్ల రూపాయ‌ల‌ క‌రెంటు బకాయిల‌ను త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చి చెల్లించింద‌న్నారు. ఈయ‌న వ్య‌వ‌సాయ‌దారుడు కాద‌ని ద‌ళారి, బ్రోక‌ర్ అన్నారు.

రైతులు పండించిన ధాన్యాన్ని త‌క్కువ రేటుకు కొని హెరిటేజ్‌లో చంద్ర‌బాబు అమ్ముకుంటున్నార‌న్నారు. ఇలాంటి వ్య‌క్తికి ఇప్పుడు రైతుల‌పై ప్రేమ పుట్టుకొచ్చింద‌న్నారు. త్వ‌రలోనే చంద్ర‌బాబుకు 76 ఏళ్లు వ‌స్తాయ‌న్నారు. ఇక ఎన్నిక‌లొస్తే చంద్ర‌బాబు అలివికానీ వాగ్ధానాల‌న్నీ చేస్తార‌న్ని మండిప‌డ్డారు. ఊహించ‌ని విధంగా మ్యానిఫెస్టో పెడ‌తార‌న్నారు. అయినా చంద్రబాబును న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్నారు.

80 ఏళ్లు దాటాక చంద్ర‌బాబుకు మైండ్ ప‌నిచేయ‌ద‌న్నారు. ఆయ‌న్ను ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు కూడా రానివ్వ‌ని ప‌రిస్థితి ఉంటుంద‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్రబాబు అధికారంలోకి వ‌చ్చే చాన్స్ లేద‌న్నారాయ‌న‌. ఇక మాజీ మంత్రి అచ్చెన్నాయ‌డు విష‌యంలో నాని మాట్లాడారు. ప్ర‌పంచంలో పైల్స్ ఆప‌రేష‌న్ చేయించుకున్న ఏ వ్య‌క్తి 70 రోజులు హాస్పిట‌ల్‌లో ఉండ‌ర‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here