‘రాఖీ భాయ్‌ లవర్‌’ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది..

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్‌ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసంలేదు. విడుదల వరకు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా విడుదల తర్వాత రికార్డులు తిరగరాసింది. యావత్‌ భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో రాఖీ భాయ్‌గా యశ్‌ అద్భుత నటనను కనబరిచాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్‌2 తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ కొంత భాగాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరించారు. కేజీఎఫ్‌1 చివరిలో చెప్పిన ‘అసలు కథ మొదలయ్యేది ఇప్పుడే’ అన్నట్లు ఈ సినిమాకు ముగింపు లభించేది కేజీఎఫ్‌2లోనే దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఇదిలా ఉంటే నేడు (బుధవారం) హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి పుట్టినరోజు. కేజీఎఫ్‌లో రీనా పాత్రలో ఈ అమ్మడు మెప్పించింది. పాత్ర నిడివి చిన్నదే అయినా కనిపించిన కొద్దిసేపు తన నటన, అందంతో ఆకట్టుకుంది. ఇక తాజాగా శ్రీనిధి శెట్టి పుట్టిన రోజును పురస్కరించుకొని చిత్ర యూనిట్‌ కేజీఎఫ్‌2లో ఆమె లుక్‌ను విడుదల చేసింది. ఈ ఫస్ట్‌ లుక్‌లో బ్లాక్‌ శారీలో క్యూట్‌ లుక్స్‌ తో ఆకట్టుకుంటోందీ చిన్నది. ఇక శ్రీనిధి వెనకాల యశ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే షేడ్‌తో చూపించారు. మరి మొదటి భాగంలో హీరోహీరోయిన్ల మధ్య పెద్దగా సన్నివేశాలు లేవు కాబట్టి.. రెండో పార్ట్‌ లో అయినా రొమాంటిక్‌ సీన్‌లు ఉంటాయో చూడాలి. కేజీఎఫ్‌2 విడుదల కోసం యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here