ఒక్క పోస్ట్ తో పుకార్లకు చెక్‌ పెట్టిన భూమిక..

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగారు నటి భూమిక. మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌ వంటి సూపర్‌ స్టార్‌ల సరసన ఆడి పాడిన భూమిక ఇటీవల నాని హీరోగా నటించిన ‘ఎంసీఏ’ చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే గతకొన్ని రోజులుగా భూమిక వైవాహిక జీవితానికి సంబంధించి ఓ వార్త తెగ వైరల్‌గా మారింది. భూమిక 2007లో యోగా టీచర్‌ భరత్‌ ఠాకూర్‌ను వివాహం చేసుకుంది. అయితే తాజాగా ఈ జంట వీడిపోయారని ఓ వార్త తెగ వైరల్‌గా మారింది. భూమిక తన భర్తకు సంబంధించి సోషల్‌ మీడియాలో ఒక్క పోస్ట్‌ కూడా పెట్టకపోవడంతో తన భర్తకు విడాకులిచ్చారా? అంటూ గాసిప్‌ రాయుళ్లు పుకారు మొదలుపెట్టారు. అయితే దీనిపై భూమిక ఒక్కసారి కూడా స్పందించలేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక్క పోస్ట్‌ తో పుకార్లన్నింటికీ చెక్‌ పెట్టిందీ హీరోయిన్‌. తాజాగా భూమిక, భరత్‌ల పెళ్లి రోజును పురస్కరించుకొని.. భూమిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ చేసింది. ఇద్దరు చాలా సాన్నిహిత్యంగా దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను ప్రపంచానికి తెలియజేసింది. దీంతో వీరిపై వస్తోన్న వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పడినట్టైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here