రాం గోపాల్ వ‌ర్మ మ‌రో సంచ‌ల‌న మూవీ గురించి కీల‌క అప్‌డేట్‌..

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ ఎప్పుడూ వివాదాస్ప‌ద సినిమాలే తీస్తుంటారు. ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుల జీవితాలను ఆదారంగా ఆయ‌న సినిమాలు తీస్తూ వార్త‌ల్లోక‌క్కుతూ ఉంటారు. అయితే త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై కూడా ఆయ‌న దృష్టి ప‌డింది. త‌మిళ‌నాడు ఎన్నిక‌ల‌కు ముందే ఈ సినిమా కూడా రిలీజ్ అవ్వ‌బోతోంది.

అవినీతి కేసులో క‌ట‌క‌టాల వెన‌క్కు వెళ్లిన చిన్న‌మ్మ శ‌శిక‌ళ బ‌యోపిక్ తీస్తున్న‌ట్లు వ‌ర్మ గ‌త సంవ‌త్స‌ర‌మే ప్ర‌క‌టించారు. ఈ సినిమాకు ల‌వ్ ఈజ్ డేంజ‌ర‌స్‌లీ పొలిటిక‌ల్ అన్న క్యాప్ష‌న్‌తో పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా శ‌నివారం నాడు మ‌రోసారి శ‌శిక‌ళ సినిమా గురించి ప్ర‌స్తావిస్తూ ” J, S, E, P, S మ‌ధ్య ఉన్న బంధాన్ని, వారి రాజ‌కీయ తెరంగ్రేటాన్ని చూపించ‌బోతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ సినిమాను ఎన్నిక‌ల క్నా ముందే రిలీజ్ చేస్తామ‌ని అన్నారు. ఈ బ‌యోపిక్‌కు సంబంధించిన ఓ పిక్‌ను కూడా రిలీజ్ చేశారు. కాగా వ‌ర్మ ఇప్ప‌టికే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌, అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు, ప‌వ‌ర్‌స్టార్, దిశ, నేక్‌డ్‌, క్లైమాక్స్‌, క‌రోనా వంటి సినిమాలు తీసిన విష‌యం తెలిసిందే. ఇక ఈ సినిమాపై త‌మిళ‌నాడులో హై టెన్ష‌న్ నెల‌కొంది. వ‌ర్మ ఈ సినిమాను ఏ విధంగా తెర‌కెక్కించ‌నున్నారో, అందులో ఏఏ విష‌యాలు ఉన్నాయో అన్న ఆస‌క్తి నెల‌కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here