కీర్తి సురేష్ అలాంటి ఫోటో పోస్ట్ చేసిన‌ నితిన్‌..

హీరో నితిన్‌, హీరోయిన్ కీర్తి సురేష్ క‌లిసి న‌టిస్తున్న చిత్రం రంగ్ దే. ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో జ‌రుగుతోంది. ఇటీవ‌లె చిత్ర బృందం మొత్తం దుబాయ్‌కు వెళ్లిపోయారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.

ఇక దుబాయ్‌లో షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో తీసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. షూటింగ్ స్పాట్‌లో కీర్తి సురేష్ కుర్చీలో కూర్చొని అలా నిద్రిస్తూ ఉంది. దీంతో వెంట‌నే డైరెక్ట‌ర్ వెంకీతో క‌లిసి నితిన్ ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లి పిక్ తీసుకున్నారు. ఈ ఫోటోను ట్విట్టర్‌లో నితిన్ పోస్టు చేశాడు. తాము చెమటలు చిందిస్తుంటే.. కీర్తి హాయిగా నిద్రపోతోందని పేర్కొంటూ ఆ ఫొటోను నితిన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌కు కీర్తి స్పందిస్తూ.. `మీరు జెలసీగా ఫీలవుతున్నారు కదా` అని పేర్కొంది. దుబాయ్ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతున్నట్టు సమాచారం. లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా షూటింగ్ ఆగిపోయిన విష‌యం తెలిసిందే. కాగా లాక్‌డౌన్‌లోనే హీరో నితిన్ వివాహం కూడా జ‌రిగింది. ఇప్పుడు షూటింగ్ వేగంగా జ‌రుగుతోంది. సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here