ప్రేమ గురించి క్లారిటీ ఇచ్చిన రేణూ దేశాయ్‌..

ప్ర‌ముఖ న‌టి రేణూ దేశాయ్ ప్రేమ గురించి ఇటీవ‌ల మాట్లాడిన మాట‌లు బాగా వైర‌ల్ అవుతున్నాయి. ప్రేమలో విఫలమైతే తట్టుకోవడం కష్టమని, ఆ బాధ తనకు తెలుసని నటి రేణూ దేశాయ్ పేర్కొన్నారు. అలాగే ప్రేమలో విఫలమైనంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం సరికాదని అన్నారు.

రేణూ దేశాయ్ ఇటీవ‌ల ఇన్‌స్ట‌గ్రామ్‌లో అభిమానుల‌తో మాట్లాడారు. లైవ్‌లోకి వ‌చ్చిన ఆమె ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు. ప్రేమలో విఫలమవడం గురించి మాట్లాడుతూ.. `ప్రేమలో విఫలమైతే ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు. మనం ఎంతగానో ప్రేమించిన వ్యక్తి మన పక్కన లేడని, మనం మోసపోయామని అనిపించినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం తప్పు. నీ జీవితం, ప్రాణం కంటే ఎవరూ ఎక్కువ కాదు. కౌన్సిలింగ్ తీసుకుంటూ కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయంతో సులభంగా ఆ బాధ నుంచి బయటపడొచ్చ`ని రేణు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here