వెరీ పూర్ స్టేజ్ చేరుకున్న ఢిల్లీ వాయు కాలుష్యం.. డేంజ‌ర్ జోన్‌లో ప్ర‌జ‌లు..

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప‌రిస్థితులు ఏమాత్రం బాగోలేవు. ఇప్ప‌టికే క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతుండ‌గా ఇప్పుడు వాయు కాలుష్యం కూడా భ‌య‌పెడుతోంది. ఉండాల్సిన దాని కంటే ఎక్కువ‌గా ఉన్న వాయు కాలుష్యం.. ఇప్పుడు మ‌రో మార్క్‌ను చేరుకోవ‌డానికి రెడీ అవుతోంది. దీంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ఢిల్లీలో వాయు కాలుష్యం పై కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని వాతావ‌ర‌ణ అంచ‌నా ప‌రిశోధ‌న ఓ విష‌యాన్ని వెల్ల‌డించింది. యిర్ క్వాలిటీ ఇండెక్స్ వివరాల ప్రకారం.. ఢిల్లీలో వాయు కాలుష్యం గరిష్టంగా 400 పాయింట్లకు చేరుకుంది. అత్యల్పంగా 300 పాయింట్లకు చేరుకుంది. వాస్తవానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం.. వాయు కాలుష్యం 201-300 మధ్య ఉంటే ‘పూర్’గా ఉన్నట్లు.. 301-400 మధ్య వాయు కాలుష్యం ఉంటే ‘వెరీ పూర్’ ఉన్నట్లు. ఢిల్లీలో వాయు కాలుష్యం ‘వెరీ పూర్’ గరిష్ట మార్క్‌ను చేరుకుంది. ఇది కూడా దాటితే ‘సేవర్’ (తీవ్రస్థాయి) చేరుకుంటుంది.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం.. ఇదే అత్యంత తీవ్ర వాయు కాలుష్యం. ఢిల్లీలో పరిస్థితులు ఈ మార్క్‌ను కూడా చేరుతాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒక వైపు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట నష్టం తగబెట్టిన కాలుష్యం ఓవైపు ఢిల్లీ నగరాన్ని అతలాకుతలం చేస్తుండగా, తాజాగా దీపావళి బాణాసంచాకాలుష్యంతో పరిస్థితి మరీంత తీవ్రంగా మారిందట. వాయు కాలుష్యాన్ని అదుపు చేయడంలో అధికార యంత్రాంగం పనితీరుపై రాజధాని ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మామూలుగానే వాయు కాలుష్యంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. పైగా ఇప్పుడు క‌రోనా ఉండ‌టంతో ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌నే చెప్పాలి. మ‌రి వాయు కాలుష్యంపై ఇప్ప‌టికైనా ఒక స్ప‌ష్ట‌మైన విధానం ఒక‌టి రూపొందించి దీన్నిత‌గ్గించాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here