న‌లుగురు క‌రోనా పేషెంట్లు మృతి.. హాస్పిట‌ల్‌లో అగ్నిప్ర‌మాదం..

క‌రోనా సోకి హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న న‌లుగురు మృతిచెందారు. ఆసుప‌త్రిలో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకోవ‌డంతో వీరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. క‌రోనా రోగులు చ‌నిపోయార‌న్న వార్త‌లు తెలియ‌డంతో అంద‌రూ విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

గుజరాత్ రాష్ట్రంలోని కొవిడ్ ఆసుపత్రి ఐసీయూలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు కరోనా రోగులు మరణించారు. రాజ్ కోట్ నగరంలోని శివానంద్ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శివానంద్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ఆరుగురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఐసీయూలో మంటలు చెలరేగినపుడు 11 మంది రోగులున్నారు. ఈ అగ్నిప్రమాదంలో పలువురు రోగులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు.

గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ‌లో కూడా క‌రోనా వార్డులో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ర‌మేష్ హాస్పిట‌ల్స్ నిర్వ‌హిస్తున్న కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదం వ‌ల్ల ప‌ది మంది చ‌నిపోయారు. దీంతో ఈ విష‌యం అప్ప‌ట్లో దేశ వ్యాప్తంగా చ‌ర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు మ‌రోసారి క‌రోనా వార్డులో అగ్నిప్ర‌మాదం విష‌యం తెలియ‌డంతో నిర్వ‌హ‌ణ‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here