ప్ర‌భాస్ మూడు సినిమాల ఖ‌ర్చు వెయ్యి కోట్లు నిజ‌మేనా..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ దూసుకుపోతున్నారు. బాహుబ‌లి త‌ర్వాత ఆయ‌న రేంజ్ పూర్తిగా మారిపోయింది. కేవ‌లం ప్ర‌భాస్ భారీ బ‌డ్జెట్ సినిమాలే చేస్తున్నారు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న సినిమాలు వంద కోట్ల బ‌డ్జెట్‌తో ముందుకు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది.

ప్రభా్‌సకు ఉన్న క్రేజ్‌, డిమాండ్‌ దృష్టిలో పెట్టుకొని కోట్లు కుమ్మురించడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు. ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో తయారువుతుండడమే దీనికి మంచి ఉదాహరణ. ప్రభాస్‌, పూజా హెగ్టే జంటగా రూపుదిద్దుకొంటున్న పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామా ‘రాధేశ్యామ్‌’ దాదాపు రూ. 250 కోట్లతో రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమాలో విక్రమాదిత్య పాత్రను ప్రభాస్‌ పోషిస్తున్నారు. ఇక ‘ఆదిపురుష్‌’. సినిమా షూటింగ్‌ ప్రారంభించకుండానే రిలీజ్‌ డేట్‌ ప్రకటించేసి ప్లానింగ్‌పరంగా తాము ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నారో చెప్పకనే చెప్పారు ఆ చిత్రదర్శకనిర్మాతలు. ప్రభాస్‌ శ్రీరాముడి పాత్రను పోషించే ఈ చిత్రం రూ. 450 కోట్ల బడ్జెట్‌తో రూపొందనుంది. దర్శకుడు నాగ్‌అశ్విన్‌ ప్రభాస్‌ హీరోగా రూపొందించనున్న సైన్స్‌ ఫిక్షన్‌ రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకోనుందని సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన దీపికా పదుకోన్‌ కథానాయికగా నటిస్తారు. ఈ మూడు సినిమాల బ‌డ్జెట్ వెయ్యి కోట్లు ఉండ‌టంతో అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here