రాజ‌కీయాల‌పై బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బండ్ల గ‌ణేష్ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. న‌టుడిగా. నిర్మాతగానే కాకుండా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఆయ‌న త‌న‌దైన శైలిలో అందరి దృష్టిలో ప‌డ్డారు. అయితే కొద్ది రోజులుగా ఆయ‌న రాజ‌కీయాల‌కు పూర్తిగా దూరంగా ఉన్నారు. రాజ‌కీయాల‌తో త‌న‌కు సంబంధం లేదంటున్నారు.

ఇప్పుడు హైద‌రాబాద్‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. దీంతో సోష‌ల్ మీడియాలో బండ్ల గ‌ణేష్ పేరు ఇప్పుడు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున జోరుగా చర్చా కార్యక్రమాలు జరిపిన బండ్ల గణేష్‌ని నెటిజన్లు కొందరు కావాలనే టార్గెట్‌ చేస్తున్నారు. వాస్తవానికి బండ్ల గణేష్‌.. ”ఇక రాజకీయాలకు దూరం అవుతున్నాను.. నా పనేదో నేను చూసుకుంటున్నాను. మళ్లీ సినిమాలు నిర్మిస్తాను..” అని క్లారిటీ ఇచ్చినప్పటికీ అతనిపై రాజకీయ అస్త్రాలు ఆగడం లేదు. గతంలో బ్లేడ్‌ విషయంలో కూడా ఇలాంటి మాటలే చెప్పి.. మాట మీద నిలబడలేదు అని చెబుతూ.. బండ్లపై గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో బండ్ల గ‌ణేష్ మ‌రోసారి ట్విట్ట‌ర్ వేదిక‌గా క్లారిటీ ఇచ్చారు. త‌న‌కు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు నేను రాజకీయాలకు దూరం అని తెలిపారు. మ‌రి ఇప్ప‌టికైనా నెటిజ‌న్లు కూల్ అవుతారో లేదో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here