ఏపీలో సీఎం కేసీఆర్ కొత్త పార్టీ..ప‌రిశీల‌న‌లో ఆంధ్ర రాష్ట్ర‌స‌మితి

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్ర‌దేశ్ లో పార్టీని స్థాపించ‌బోతున్నారా…? దీనికి పెద్ద‌సంఖ్య‌లో ఆంధ్ర‌ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉందా..? చంద్ర‌బాబుకు చేయ‌ల‌నేనివి కేసీఆర్ చేస్తార‌ని న‌మ్మ‌కంతో ఉన్నారా…? దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల ముందే కేసీఆర్ ఏపీలో పార్టీని స్థాపించ‌బోతున్నారా…? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తుంది. తెలంగాణ రాష్ట్రం సాధించిన త‌రువాత కేసీఆర్ క్రేజ్ మ‌రింత పెరిగింది. రాష్ట్రం కోసం కేంద్ర‌తో పోరాడి త‌మ డిమాండ్ల‌ను నెర‌వ‌రేర్చుకునే నైజం కేసీఆర్ కు ఉంద‌నే చెప్పాలి. అయితే ఏపీలో చంద్ర‌బాబు నాయుడి పాల‌న వ్య‌తిరేకిస్తున్న ప్ర‌జ‌లు సీఎం కేసీఆర్ ను ఏపీలో పార్టీని పెట్టాల‌నే లేఖ‌లు, మెయిల్స్ వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది.

అమ‌రావ‌తి శంకుస్థాప‌న స‌మ‌యంలో కేసీఆర్ అమ‌రావతి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జలు పెద్ద ఎత్తున త‌మ హ‌ర్షాతిరేకాల్ని వ్య‌క్తం చేశారు. అంతేకాదు కేసీఆర్ త‌న‌యుడు మంత్రి కేటీఆర్ కోళ్ల పందాల‌కు ప‌ర్మీష‌న్లు ఇస్తే  భీమ‌వ‌రం లో పోటీ చేస్తే తాము గెలిచి తీరుతామంటూ చ‌లోక్తి విసిరారు. అప్ప‌టినుంచి కేసీఆర్ త‌మ పార్టీని ఏపీలో విస్త‌రించాల‌నే ప‌నిలో ఉన్నాడ‌ని ఊహించిన కొంద‌రు కేసీఆర్  ఏపీలో పార్టీ పెట్టాల‌ని, అందుకు తాము మ‌ద్ద‌తు తెలుపుతామంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న చేశాడు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌భుత్వ ప‌నీతిరును ఎండ‌గ‌డుతు ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.

ఈ వ్యాఖ్య‌ల్ని తిప్పికొట్టిన కేసీఆర్ ..తెలంగాణ‌పై కేంద్రం తీరు ఎలా ఉందో ఆధారాల‌తో చూపించాడు. అంతే కేసీఆర్ తెగువ‌తో ఫిదా అయిన కొంత‌మంది తెలుగు రాష్ట్రాల్ని మీరే పాలించాలి. చంద్ర‌బాబు పాల‌న‌తో విసిగెత్తిపోయాం అని కుప్పులు తెప్పులుగా పంపిస్తున్నార‌ట . మ‌రికొంద‌రైతే ఆంధ్ర రాష్ట్ర‌స‌మితి పార్టీని ఏర్పాటు చేయాల‌ని, అందుకు ఈసీ ప‌ర్మీష‌న్ తీసుకోండని కోరుతున్నారు. వీట‌న్నింటిపై ఆలోచ‌న‌లో ప‌డ్డ కేసీఆర్ ఎప్ప‌టినుంచో వినిపిస్తున్న ఆంధ్ర రాష్ట్ర‌స‌మితి పార్టీ పేరుపై మొగ్గుచూపుతున్న‌ట్లు స‌మాచారం.  స‌రైన స‌మ‌యం చూసి ఏపీలో పార్టీ పై  త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేస్తార‌ని  పొలిటిక‌ల్ క్రిటిక్స్ అంచ‌నా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here