వివి వినాయ‌క్ డైర‌క్ష‌న్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్

ప్రస్తుతం పవన్ కల్యాణ్ కు సినిమాలకంటే రాజకీయాలపై  దృష్టిసారిస్తున్నాడు. అందుకే ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైర‌క్ష‌న్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయితే సినిమాల‌కు బై చెప్పి పుల్ టైం పాలిటిక్స్ లోకి ఎంట‌ర్  అవుతున్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు 2019 ఎన్నిక‌ల్లో గెల‌వాలని క‌స‌ర‌త్తులు కూడా చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో సినిమాలో పొలిటిక‌ల్ ప‌వ‌ర్ చూపించి ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా ఏంటో చూపించాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు.
దీనికి సంబంధించిన వార్త పొలిక‌ల్ వ‌ర్గాల్లో చ‌ర్చాంశ‌నీయంగా మారింది. యాక్ష‌న్, పొలిటిక‌ల్ యాంగిల్లో కమర్షియల్ చిత్రాలను తనదైన శైలిలో చిత్రికరించే దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో పవన్ నటించబోతున్నాడనేది తాజా వార్త. దీనిపై ఎటువంటి అధికారిక‌ప్ర‌క‌ట‌న లేకున్నా వివి వినాయ‌క్ మెగా హీరోల‌కు క‌లిసివ‌స్తున్నాడ‌నే చెప్పుకోవాలి.  దాదాపు 10 సంవ‌త్స‌రాల త‌రువాత చిరుతో చేసిన ఖైదీ సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిన విష‌య‌మే. కొడుకు రాంచర‌ణ్ తో నాయ‌క్ , ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తో మ‌రో సినిమా అంటూ మెగా హీరోల క్రేజీ కాంబినేష‌న్ లో దూసుకుపోతున్నాడు వివి వినాయ‌క్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here