కాటమరాయుడు ఫుల్ రన్ షేర్ ఇంత ఉండచ్చు !

టాక్ ఎలా ఉన్నా కూడా కాటమరాయుడు చిత్రం యాభై నాలుగు కోట్ల షేర్ ని రాబట్టింది. ఇది చాలా గొప్ప విషయం ఇదే కంటెంట్ తో ఇదే లాభాలతో ఇదే సినిమా వేరే హీరో తీసి ఉంటె ముప్పై కే మూట కట్టేసుంది, థియేటర్ లోంచి సినిమాని కూడా తీసేస్తారు. సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి ప్లాప్ తో కూడా యాభై కోట్లు లాగిన పవన్ కళ్యాణ్ తన సత్తా చాటుకున్నాడు. టాక్ తో సంబంధం లేకుండా లో తనకి తిరుగు లేదు అని అనిపించుకోవడం పవన్ కే చెందింది.

ఇంకొక ముప్పై కోట్లు వస్తే కాటమరాయుడు హిట్ అవుతుంది అంటే బ్రేక్ ఎవెన్ వచ్చేస్తుంది. అది మొత్తం కాకపోయినా అందులో ఒక సగమైతే రావచ్చునని అంచనాలున్నాయ్‌. అంటే ఆ లెక్క డబ్భై కోట్ల దగ్గర తేలుతుంది అన్న మాట.అమ్మిన రేట్లకి తగ్గ రిటర్న్స్‌ కాదు కానీ, డాలీ, అనూప్‌లాంటి వాళ్లంతా ఏడు పదుల కోట్ల క్లబ్బులో చేరిపోతారు. పూర్తిగా పవన్ కళ్యాణ్ షో అవడం తో వారికి టాలెంట్ పరంగా లాభం ఉండదు అనే చెప్పాలి .. మొత్తం మీద డబ్భై కోట్ల దగ్గర రాయుడు ఆగచ్చు అంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here