మరోసారి వార్తలో నిలిచిన కంగనా.!

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తున్నారు బాలీవుడ్‌ నటి కంగానా రనౌత్‌. బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం, ముంబయి నగరంపై పలు వ్యాఖ్యలు చేసి ఏకంగా ముంబయి ప్రభుత్వంతోనే ఢీ అంటే ఢీ అనేలా పోరాటం చేసిన కంగానా ఇప్పుడిప్పుడే తన షూటింగ్‌లలో బిజీగా మారారు. ఈ క్రమంలోనే షూటింగ్‌లో భాగంగా కంగనా తాజాగా హైదరాబాద్‌ వచ్చారు.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి భక్తి అనే అంశంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు కంగనా. ఇటీవల హాలీవుడ్‌కి చెందిన సల్మాన్‌ హయెక్‌ అనే నటి లక్ష్మీదేవిని పూజిస్తానని.. మేడిటేషన్‌ చేసేప్పుడు లక్ష్మీదేవిని గుర్తుచేసుకుంటాను అని తెలుపుతూ.. ట్విట్టర్‌ వేదికగా లక్ష్మీ దేవి ఫొటోను పోస్ట్‌ చేశారు. అయితే తాజాగా కంగానా హాలీవుడ్‌ తార చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ.. ‘నేను ఊహించని విధంగా ప్రపంచంలో శివుడు, కృష్ణుడు, దేవి భక్తులను కనుగొన్నాను. మతం లేదా జాతి గురించి చాలామంది రాముడిని ప్రేమిస్తారు. లేదా భగవద్గీతను అనుసరిస్తారు. కానీ భారతదేశంలో కొన్ని దురదృష్టకర ఆత్మలు భక్తిని అపహాస్యం చేస్తున్నాయి. ఇక్కడ నేను ప్రస్తావించాలనుకున్న విషయం ఒకటే. మనం ఇక్కడ భక్తిని ఎంచుకోవడం లేదు. భక్తి మనల్ని ఎంచుకుంటుంది’ అని కంగనా పేర్కొంది. మరి కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు మళ్లీ ఎలాంటి కాంట్రవర్సీలకు దారి తీస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here