అంద‌రి నోట్లో పోశారు.. నాకు కూడా పోసేశారు..

సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోన్న వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఫోటోపై ఆయన స్పందించారు. దీనిపై ర‌ఘురామ ఘ‌టుగా మాట్లాడారు. ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వైసీపీ నాయకులు తన ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

గ‌త రెండు రోజుల నుంచి ఈ ఫోటో బాగా షేర్ అవుతూ వ‌చ్చింది. దీంతో ఎంపీ ఏంటి ఇలా చేస్తున్నార‌ని అంతా చ‌ర్చించుకున్నారు. కాగా దీనిపై ఎంపీ క్లారిటీ ఇచ్చారు. ఈ ఫోటో మూడు సంవ‌త్స‌రాల క్రితం తీసింద‌ని అయితే.. హైద‌రాబాదో, క‌ల‌క‌త్తానో గుర్తు లేద‌న్నారు. కానీ ఫోటోలు ఉన్న‌ది నేనే అని చెప్పారు. తానెవ్వ‌రినీ ముట్టుకోలేద‌ని తాగింది షాంపేన్ అన్నారు. క్రికెట్‌లో క్రీడాకారులు తాగుతుంటారు క‌దా అని ఎంపీ అన్నారు.

ఫంక్ష‌న్లో అంద‌రి నోళ్ల‌లో పోశార‌ని.. త‌నకు కూడా అలానే చేశార‌ని.. అయితే ఏదో జ‌రిగిపోయిన‌ట్లు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మంత్రి పెద్దిరెడ్డి ఫోటోతో, ఎంపీ అవినాష్ రెడ్డి ఫోటోతో డీపీ పెట్టుకొని కొంతమంది వ్యక్తులు తనను అసభ్యంగా దూషిస్తూ మెసేజీలు పంపుతున్నారన్నారు. దీనిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాలన్నారు. లేదంటే ఢిల్లీ పోలీసులు చూసుకుంటారని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here